Skip to main content

Posts

Showing posts from June, 2021

Featured Konvict

Pure Love Of Vrindaavan

  PURE LOVE శ్రీ కృష్ణుడు వ్రిందావన్ వదిలి అంటే తన మిత్రులను యశోదా మయ్యా నంద్ బాబా అందరినీ వదిలి  మథురా నగరం లో ఉంటున్న రోజుల్లో  ఒకరోజు శ్రీ కృష్ణుని కి తను పెరిగిన ఊరు అంటే వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది, గుర్తుకు రావడం అంటే ప్రతీ రోజు గుర్తుకు వస్తుంది కానీ ఆరోజు ఇంకా ఎక్కువగా గుర్తుకు వస్తుంది ఎంతలా అంటే ఏడ్చే అంతగా.  అయితే మథురా లో కృష్ణుడి తో పాటుగా తన ప్రియాతి ప్రియ మిత్రుడు కూడా ఉంటాడు తన పేరు ఉధవ్, రంగు లొనూ రూపం లోను జ్ఞానం లోను శ్రీ కృష్ణుడితో సరిపోలు  వాడు, బృహస్పతి యొక్క శిషుడు, జ్ఞానానికి తప్ప మరేదానికి అంతగా  ప్రాధాన్యత  ఇచ్చేవాడు కాదు , అయితే శ్రీ కృష్ణుడు తన మిత్రుడైన ఉధవ్ కి ప్రేమ యొక్క మహత్వాన్ని తెలియజేయాలి అని అనుకుంటాడు కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు. ఒకరోజు కృష్ణుడు తన రాజ విధులను అన్నింటినీ ముగించుకుని వచ్చి తన గదిలో కూర్చుంటాడు, శ్రీ కృష్ణుడి గదిలో ఒక పెద్ద కిటికీ ఉంటుంది, అందులోనుండి చుస్తే వ్రిందావన్ లోని యమునా నదీ తిరం కనిపించేది, ఆ రోజు శ్రీ కృష్ణుడికి  వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది ఎంతైనా చిన్ననాటి నుండి అక్కడే పెరిగాడు కదా, ఎవ్వరికైనా చిన్ననాటి అనుభవాల