PURE LOVE శ్రీ కృష్ణుడు వ్రిందావన్ వదిలి అంటే తన మిత్రులను యశోదా మయ్యా నంద్ బాబా అందరినీ వదిలి మథురా నగరం లో ఉంటున్న రోజుల్లో ఒకరోజు శ్రీ కృష్ణుని కి తను పెరిగిన ఊరు అంటే వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది, గుర్తుకు రావడం అంటే ప్రతీ రోజు గుర్తుకు వస్తుంది కానీ ఆరోజు ఇంకా ఎక్కువగా గుర్తుకు వస్తుంది ఎంతలా అంటే ఏడ్చే అంతగా. అయితే మథురా లో కృష్ణుడి తో పాటుగా తన ప్రియాతి ప్రియ మిత్రుడు కూడా ఉంటాడు తన పేరు ఉధవ్, రంగు లొనూ రూపం లోను జ్ఞానం లోను శ్రీ కృష్ణుడితో సరిపోలు వాడు, బృహస్పతి యొక్క శిషుడు, జ్ఞానానికి తప్ప మరేదానికి అంతగా ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు , అయితే శ్రీ కృష్ణుడు తన మిత్రుడైన ఉధవ్ కి ప్రేమ యొక్క మహత్వాన్ని తెలియజేయాలి అని అనుకుంటాడు కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు. ఒకరోజు కృష్ణుడు తన రాజ విధులను అన్నింటినీ ముగించుకుని వచ్చి తన గదిలో కూర్చుంటాడు, శ్రీ కృష్ణుడి గదిలో ఒక పెద్ద కిటికీ ఉంటుంది, అందులోనుండి చుస్తే వ్రిందావన్ లోని యమునా నదీ తిరం కనిపించేది, ఆ రోజు శ్రీ కృష్ణుడికి వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది ఎంతైనా చిన్ననాటి నుండి అక్కడే పెరిగాడు కదా, ఎవ్వరికైనా చిన్ననాటి అనుభవాల
🙏 జై శ్రీరామ్ 🙏 రాముడు కావాలంటే మనలోని కామాన్ని దూరం చేయాలి, ఎందుకంటే ఈ రెండూ ఒకచోట ఉండలేవు. రామవాంఛ కలవానికి కామవాంఛ ఎన్నటికీ ఉండదు. అలాగే కామవాంఛ కలవాడు రాముడిని ఆహ్వానించలేడు, శ్రీరాముని సన్నిదియందు కామము పటాపంచలైపోతుంది. ఇప్పుడు నేను మీకు రామాయణం లోని ఒక చిన్న సందర్బం వివరిస్తాను . రావణుడు సీతాదేవి ని లంకకు తీసుకువచ్చి అశోకవనములో ఉంచి సీతా దేవిని తన వశపరుచు కోవడానికి సర్వ విధములా ప్రయత్నిస్తాడు, కానీ సీతాదేవి కనీసము చూడకపోగా ఒక గడ్డి పరకని రావణునికి చూపించి దీనికన్నా నీవు హీనమైన వాడివి అని అంటుంది, ఒకరోజు మండోధరి ( రావణుని బార్య ) రావణునితో ఇలా అంటుంది....... నాథా! సీతను స్వాదీనపరుచుకొనుటకు ఒక చక్కని ఉపాయము ఉన్నది అలకించండి అని అంటుంది. అప్పుడు రావణాసురుడు ఏమిటి దేవి ఆ ఉపాయము అని అడగగా, మండోధరి ఇలా అంటుంది, మీకు అనేక శక్తులు మరియు ఆదిసిద్దులున్నవి కదా! ఈ క్షణమే మీరు అచ్చము శ్రీరామచంద్రుని వలె వేశమును ధరించి, సీత వద్ధకు వెల్లండి అప్పుడు తక్షణమే సీత మీ వశమగును అని చెప్పగా విని అప్పుడు రావణాసురుడు మండ