Skip to main content

Posts

Showing posts from August, 2020

Featured Konvict

Pure Love Of Vrindaavan

  PURE LOVE శ్రీ కృష్ణుడు వ్రిందావన్ వదిలి అంటే తన మిత్రులను యశోదా మయ్యా నంద్ బాబా అందరినీ వదిలి  మథురా నగరం లో ఉంటున్న రోజుల్లో  ఒకరోజు శ్రీ కృష్ణుని కి తను పెరిగిన ఊరు అంటే వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది, గుర్తుకు రావడం అంటే ప్రతీ రోజు గుర్తుకు వస్తుంది కానీ ఆరోజు ఇంకా ఎక్కువగా గుర్తుకు వస్తుంది ఎంతలా అంటే ఏడ్చే అంతగా.  అయితే మథురా లో కృష్ణుడి తో పాటుగా తన ప్రియాతి ప్రియ మిత్రుడు కూడా ఉంటాడు తన పేరు ఉధవ్, రంగు లొనూ రూపం లోను జ్ఞానం లోను శ్రీ కృష్ణుడితో సరిపోలు  వాడు, బృహస్పతి యొక్క శిషుడు, జ్ఞానానికి తప్ప మరేదానికి అంతగా  ప్రాధాన్యత  ఇచ్చేవాడు కాదు , అయితే శ్రీ కృష్ణుడు తన మిత్రుడైన ఉధవ్ కి ప్రేమ యొక్క మహత్వాన్ని తెలియజేయాలి అని అనుకుంటాడు కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు. ఒకరోజు కృష్ణుడు తన రాజ విధులను అన్నింటినీ ముగించుకుని వచ్చి తన గదిలో కూర్చుంటాడు, శ్రీ కృష్ణుడి గదిలో ఒక పెద్ద కిటికీ ఉంటుంది, అందులోనుండి చుస్తే వ్రిందావన్ లోని యమునా నదీ తిరం కనిపించేది, ఆ రోజు శ్రీ కృష్ణుడికి  వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది ఎంతైనా చిన్ననాటి నుండి అక్కడే పెరిగాడు కదా, ఎవ్వరికైనా చిన్ననాటి అనుభవాల

Genealogy tree of lord Rama శ్రీ రాముని వంశ వృక్షం

  శ్రీ రామ చంద్రుడి వంశ వృక్షము బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడి కొడుకు సూర్యుడు సూర్యుడి కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృధువు పృధువు కొడుకు త్రిశంఖుడు త్రిశంఖుడి కొడుకు  దుంధుమారుడు దుంధుమారుడు కొడుకు మాంధాత మాంధాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధృవసంధి ధృవసంధి కొడుకు భరతుడు భరతుడి కొడుకు అశితుడు అశితుడి కొడుకు సగరుడు సగరుడి కొడుకు అసమంజసుడు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు అంశుమంతుడి కొడుకు దిలీపుడు దిలీపుడి కొడుకు భగీరధుడు భగీరధుడి కొడుకు కకుత్సుడు కకుత్సుడి కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవుర్ధుడు ప్రవుర్ధుడి కొడుకు శంఖనుడు శంఖనుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శ్రీఘ్రవేదుడు శ్రీఘ్రవేదుడి కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యకుడు ప్రశిష్యకుడి కొడుకు అంబరీశుడు అంబరీశుడి కొడుకు నహుషుడు నహుషుడి కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుడి కొడుకు అజుడు అజుడి కొడుకు ధశరథుడు ధశరథుడి కొడుకు రాముడు రాముడి కొడుకులు లవకుశులు 🙏జై

Moral Tale of Jatayuvu జటాయువు నీతి కథ

 ధర్మొ రక్షతి రక్షితః తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు. రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు  మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు.  "జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం  "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది. కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు  ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వు నవ్వుతున్నారు! ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో జటాయువు శ్రీరాముడి  ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్

Purity of lord sri rama శ్రీ రాముని రూపం గొప్పతనం

🙏 జై శ్రీరామ్ 🙏 రాముడు కావాలంటే మనలోని కామాన్ని దూరం చేయాలి, ఎందుకంటే ఈ రెండూ ఒకచోట ఉండలేవు. రామవాంఛ కలవానికి కామవాంఛ ఎన్నటికీ ఉండదు. అలాగే కామవాంఛ కలవాడు రాముడిని ఆహ్వానించలేడు, శ్రీరాముని సన్నిదియందు కామము పటాపంచలైపోతుంది. ఇప్పుడు నేను మీకు రామాయణం లోని ఒక  చిన్న సందర్బం వివరిస్తాను . రావణుడు సీతాదేవి ని లంకకు తీసుకువచ్చి అశోకవనములో ఉంచి సీతా దేవిని తన వశపరుచు కోవడానికి సర్వ విధములా ప్రయత్నిస్తాడు, కానీ సీతాదేవి కనీసము చూడకపోగా ఒక గడ్డి పరకని రావణునికి చూపించి దీనికన్నా నీవు హీనమైన వాడివి అని అంటుంది, ఒకరోజు మండోధరి ( రావణుని బార్య ) రావణునితో ఇలా అంటుంది....... నాథా! సీతను స్వాదీనపరుచుకొనుటకు ఒక చక్కని ఉపాయము ఉన్నది అలకించండి అని అంటుంది. అప్పుడు రావణాసురుడు ఏమిటి దేవి ఆ ఉపాయము అని అడగగా, మండోధరి ఇలా అంటుంది, మీకు అనేక శక్తులు మరియు ఆదిసిద్దులున్నవి కదా!                                                                                  ఈ క్షణమే మీరు అచ్చము శ్రీరామచంద్రుని వలె వేశమును ధరించి, సీత వద్ధకు వెల్లండి అప్పుడు తక్షణమే సీత మీ వశమగును అని చెప్పగా విని  అప్పుడు రావణాసురుడు మండ